తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్కల కొనుగోలులో ఖమ్మం జిల్లా భేష్ - మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి

రబీ సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలులో తెలంగాణలో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా పర్యటనకు వచ్చిన మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి ఆ విషయాన్ని వెల్లడించారు.

khammam district has taken the top in corn purchase in the telangana state
మక్కల కొనుగోలులో ఆ జిల్లా అగ్రస్థానం సాధించింది

By

Published : May 12, 2020, 2:18 PM IST

రబీ సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలులో తెలంగాణలో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి సోమవారం ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో మక్కల కొనుగోలు, రవాణాపై చర్చించారు. జిల్లాలో అత్యధికంగా 1.03 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశారని, ఇంకా 1.40 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు.

కొనుగోలు చేసిన పంటను గుంటూరు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎంపిక చేసిన గోదాములకు రవాణా చేసేందుకు వెయ్యి వరకు లారీలు కావాల్సి ఉందని, లారీలు సమకూర్చాలని కోరారు. జిల్లాలో కొనుగోలు తీరును కలెక్టర్‌ వివరించారు. రవాణా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి :నర్సులకు వందనం..మీ సేవలకు సలాం...

ABOUT THE AUTHOR

...view details