గత కొంత కాలంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాలకు అందించిన ఆర్థిక సాయం కొంత ఉపసమనం ఇచ్చింది. కానీ రుణాలను వెంటనే కచ్చితంగా తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలతో పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక పూట గడవడానికే కష్టంగా ఉందని... డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
'పూట గడవని పరిస్థితిలో ఉన్నాం... రుణాన్ని చెల్లించలేం' - డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఖమ్మంలో మహిళలు ఆందోళన
ఓవైపు కరోనా... మరో పక్క ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉపాధి కరవై పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ సమయంలో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని ఖమ్మం జిల్లా ఏన్కూరు మహిళలు వేడుకుంటున్నారు. పూట గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో సర్కారు దయచూపాలని కోరుతున్నారు.
'పూట గడవని పరిస్థితిలో ఉన్నాం... రుణాన్ని చెల్లించలేం'
చాలామంది రోజువారి కూలీలు వైరస్ మహమ్మారి బారినపడి ఇళ్లు దాటి వెళ్లడం లేదన్నారు. లాక్డౌన్కు తోడు వర్షాల వల్ల పంటలు నీట మునిగి... ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో డ్వాక్రా సంఘాలకు మంజూరు చేసిన రుణాలు మాఫీ చేసినట్లే తమకు చేయాలని కోరుతున్నారు. చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.