తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి' - Khammam District Collector Tour in Enukuru mandal due to palle pragati programme

ఖమ్మం జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుందని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు. ఏన్కూరు మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎనిమిది పంచాయతీల్లో పర్యటించి అక్కడ చేపడుతున్న పనులను తనిఖీ చేశారు. సక్రమంగా నిర్వహణ లేని వారికి నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు.

Khammam District Collector Tour in Enukuru mandal due to palle pragati programme
'నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి'

By

Published : Jan 8, 2020, 7:53 PM IST

ఖమ్మం జిల్లాలో పల్లెప్రగతికి ఉత్సాహంగా సాగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు మంచి చొరవ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 270 ట్రాక్టర్లు కొనుగోలు చేశామని, మిగతా పంచాయతీల్లోనూ వ్యాన్లు, ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రహదారుల వెంట నాటిన మొక్కలను పరిశీలించి రక్షణ చేపట్టని ప్రాంతాల్లో ఉపాధిహామి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతి మొక్కకు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు గుర్తించి శ్మశానవాటికలు, డంపిగ్‌యార్డులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎంపీడీవో అశోక్‌, తహసీల్దార్‌ కృష్ణవేణి పాల్గొన్నారు.

'నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి'

ఇవీ చూడండి: పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details