ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా పర్యటించారు. గుబ్బగుర్తిలో చేపడుతున్న ప్రకృతి వనం, వైకుంఠధామం పనులు పరిశీలించారు. ఏన్కూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి... కొవిడ్ నిర్ధరణ పరీక్షలపై ఆరా తీశారు.
ఏన్కూరు, కొనిజర్ల మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - ఖమ్మం కలెక్టర్ తాజా పర్యటన
ప్రభుత్వ పథకాల నిర్వహణ సక్రమంగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
ఏన్కూరు, కొనిజర్ల మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
రైతు వేదిక నిర్మాణం పనులు పరిశీలించి.. వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ, నిర్మాణాల గురించి అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా మండల అధికారులు పాల్గొన్నారు.