పట్టణ ప్రగతి కార్యక్రంలో భాగంగా ఖమ్మం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను అధికారులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో చేపడుతోన్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పురపాలిక పరిధిలో నిర్మించనున్న సమీకృత కూరగాయలు, మాంసం దుకాణాల స్థలాన్ని ఆయన పరిశీలించారు.
పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేసిన కలెక్టర్ - వైరాలో పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్
సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి వ్యాపారులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గ కేంద్రంలో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు.
పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మార్కెట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి వ్యాపారులకు అందుబాటులో ఉంచాలన్నారు. వైరా పురపాలిక అభివృద్ధికి సమస్టిగా కృషి చేయాలని పాలకమండలి సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, పురపాలక ఛైర్మన్ జైపాల్, కమిషనర్ వెంకటస్వామి, తహసీల్దార్ రంగా, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఈ నెలలో ఆదివారాలూ రిజిస్ట్రేషన్లు