ఐటీహబ్ నిర్మాణం పేరుతో ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. ఇల్లెందు క్రాస్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఐటీ భవనాలను ఆయన సందర్శించారు.
ఉద్యోగాల పేరుతో ఓట్లు దండుకున్నారు: భాజపా - ఖమ్మం జిల్లా తాజా సమాచారం
ఖమ్మం జిల్లా యువతకు పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని జిల్లా భాజపా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విమర్శించారు. నాలుగేళ్లయినా ఐటీహబ్ నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు. ఎప్పటిలోగా ఉపాధి కల్పిస్తారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల పేరుతో ఓట్లు దండుకున్నారు : గల్లా సత్యనారాయణ
ఎన్నికలప్పుడు పదివేల ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేసుకోవడం తప్పా... చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన నిర్మాణాలు నాలుగేళ్లయినా ప్రారంభదశలోనే ఉన్నాయని విమర్శించారు. ఎప్పటిలోగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.