తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీతాలు తగ్గించాలని పీఆర్సీ సిఫారసు చేయడం విడ్డూరం' - Khammam District Latest News

ఉద్యోగులకు 47.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

CM effigy burnt in Khammam against PRC
పీఆర్సీకి వ్యతిరేకంగా ఖమ్మంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

By

Published : Jan 29, 2021, 4:00 PM IST

ఉద్యోగులకు 47.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ 30 నెలల తర్వాత.. జీతాలు తగ్గించాలని సిఫారసు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

ఖమ్మంలోని ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రి కేసీఆర్​ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల

ABOUT THE AUTHOR

...view details