విజయదశమి పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కారేపల్లిలో కొనసాగుతున్న కోట మైసమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏన్కూరు మండలం గార్లఒడ్డు నాచారం ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పలుచోట్ల ఆయుధ పూజ, వాహనాల పూజలు చేస్తున్నారు.
ఆయుధ, వాహన పూజలతో ఆలయాలన్నీ ఫుల్ - వైరా నియోజకవర్గంలో దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఆయుధ, వాహన పూజలతో ఆలయాలన్నీ ఫుల్