తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయాలి: సీపీఎం నాయకులు - cpm khammam latest news

ఖమ్మం జిల్లాలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

khammam cpm leader protest for covoid diagnostic tests should be performed through out the district
జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయాలి: సీపీఎం నాయకులు

By

Published : Jul 2, 2020, 12:45 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సీపీఎం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు . తక్షణమే జిల్లాలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details