తెలంగాణ

telangana

ETV Bharat / state

దుమ్ముగూడెం చేపడితే ఊరుకునేది లేదు: సీపీఎం - sagar tale pond

దుమ్ముగూడెం సాగర్ టేల్‌పాండ్‌ ప్రాజెక్టు నిర్మిస్తే ఉద్యమం చేపడతామని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ హెచ్చరించింది. రేపు రెండు తెలుగు రాష్ట్రా ముఖ్యమంత్రులు సమావేశం కానున్నందున ఈ ప్రాజెక్టుల అంశం తెరమీదకు వచ్చే అవకాశం ఉందన్నారు.

దుమ్ముగూడెం చేపడితే ఊరుకునేది లేదు: సీపీఎం

By

Published : Jun 27, 2019, 5:18 PM IST

ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నష్టం చేకూర్చే దుమ్ముగూడెం సాగర్ టేల్‌పాండ్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నందున... ఈ అంశం చర్చకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. గతంలోనే వాటి నిర్మాణం వ్యతిరేకించినట్లు తెలిపారు. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమం చేస్తామన్నారు.

దుమ్ముగూడెం చేపడితే ఊరుకునేది లేదు: సీపీఎం

ABOUT THE AUTHOR

...view details