తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ - తెలంగాణ తాజా వార్తలు

లాక్​డౌన్​ సడలింపు సమయంలో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్​ సిబ్బందికి సూచించారు. ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా మండల కేంద్రాల్లోని చెక్ పోస్టుల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.

khammam CP vishnu warrier
చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

By

Published : May 26, 2021, 4:20 PM IST

లాక్​డౌన్ సమయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా మండల కేంద్రాల్లో చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

లాక్​డౌన్​ను పోలీసులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు సమయంలో… ప్రజలు గుంపులు గుంపులుగా లేకుండా చూడాలని కోరారు. కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా సీపీతో పాటు వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్​ కుమార్, ఎస్సైలు సురేశ్​, నరేశ్​లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా ఫ్రీ విలేజ్​.. నేటికీ ఆ గ్రామానికి దరిచేరని వైరస్​

ABOUT THE AUTHOR

...view details