ఖమ్మం జిల్లావ్యాప్తంగా లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జిల్లా లాక్డౌన్ అమలవుతున్న తీరును, పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలను జిల్లా ప్రజలందరూ పాటిస్తున్నారని సీపీ సంతోషం వ్యక్తం చేశారు.
లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన సీపీ - khammam cp iqbal distributed food packets to police in town
ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్న తీరును సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సిబ్బందికి ప్రత్యేక ఆహార ప్యాకెట్లను అందజేశారు.

లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన సీపీ
అనవసరంగా బయటకు వచ్చిన 500 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇక్బాల్ వెల్లడించారు. వెయ్యి వాహనాలను సీజ్ చేశామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి రోడ్డుపై పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక ఆహార ప్యాకెట్లను అందజేశారు.
ఇదీ చదవండిః'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!