తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇఫ్తార్​ కిట్లు పంచిన ఖమ్మం సీపీ - ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఖమ్మం సీపీ 520 మంది ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్​ కిట్లు పంచారు. విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేయడానికి ప్రతీ ఒక్కరు తమవంతుగా ప్రయత్నించాలని ఎమ్మెల్యే, సీపీ తెలిపారు.

Khammam Cp Distributes Ifthar Kits
ఇఫ్తార్​ కిట్లు పంచిన ఖమ్మం సీపీ

By

Published : May 22, 2020, 11:06 PM IST

ఖమ్మం జిల్లా కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ముస్లింలకు ఇప్తార్​ విందు కిట్లు పంచారు. ఖమ్మం సీపీ తఫ్సీర్​ ఇక్బాల్​ చేతుల మీదుగా 520 ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్​ కిట్లు అందించారు. 246 మూగ జీవాలకు పశుగ్రాసం అందించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలో లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి సాయం చేశారని సీపీ గుర్తు చేశారు. కరోనా వల్ల ఈ సంవత్సరం ఇఫ్తార్​ విందు ఇవ్వలేక.. ఇంటివద్దే ముస్లిం సోదరులు ఇఫ్తార్​ విందు చేసుకునేలా ఇఫ్తార్​ కిట్లు అందించే ఆలోచన బాగుందని కితాబిచ్చారు.

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలు, వలస కార్మికులకు నిత్యావసరాలు, భోజన సదుపాయం కల్పించడమే గాక.. మూగజీవాలకు పశుగ్రాసం కూడా అందించారు. తలసేమియా, గర్భిణిల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించి 1200 యూనిట్ల రక్తం సేకరించారు. నియోజకవర్గంలోని 35 వేల మంది వలస కార్మికులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ఫౌండేషన్​ ఛైర్మన్​ హరికృష్ణ రెడ్డి, జడ్పీటీసీ కట్ట అజయ్​ కుమార్​, ఎంపీపీ రఘు, సర్పంచ్ నీరజ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details