KTR Comments on Congress :అధికారంలోకి రారని తెలిసే కాంగ్రెస్ వాళ్లు నోటికివచ్చిన హామీలు ఇస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్(BRS)లో తిరిగి చేరిన భద్రాచలం నేత తెల్లాం వెంకట్రావును ఆయన స్వాగతించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ సమక్షంలో వెంకట్రావుతో పాటు ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్‌నే అని.. మిషన్ భగీరథ(Mission Bhagiratha) దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. దేశమంతా అడవులను తొలగిస్తుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అడవులు పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని అన్నారు. ఏం చూసి మరి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఘాటుగా స్పందించారు.
Khammam Congress Leaders Joined BRS : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు ధాన్యాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని కుటుంబం రాష్ట్రంలో ఒక్కటైనా ఉందానని ప్రశ్నించారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిన.. అధికారంలోకి రామని తెలిసే నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి.. రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
"ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్. అందుకు మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా? రైతుబంధు, రైతు బీమా ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఏం చూసి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలి? కాంగ్రెస్ పాలితరాష్ట్రాల ప్రజలు ధాన్యాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాక అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అధికారంలోకి రామని తెలిసే కాంగ్రెస్ వాళ్ల నోటికివచ్చిన హామీలు ఇస్తున్నారు."- కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి