ఖమ్మం నగరంలో 7 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని అధికార పక్ష నాయకులు హామీ ఇచ్చారని... ఇప్పుడు ఎక్కడ కట్టారో చూపించాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావీద్ డిమాండ్ చేశారు. మంత్రి అజయ్ కుమార్ నగరంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారని.. ఇప్పుడు కనీసం పది శాతం కూడా ఇల్లు కట్టలేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో తెలపాలని సవాల్ విసిరారు.
'నగరంలో ఎంతవరకు హామీలు నెరవేర్చారు?' - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం నగరంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారో చూపించాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావీద్ డిమాండ్ చేశారు. నగరంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో తెలిపాలని సవాల్ విసిరారు.
!['నగరంలో ఎంతవరకు హామీలు నెరవేర్చారు?' khammam congress leader spoke on double bedroom houses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8836998-157-8836998-1600345887536.jpg)
'నగరంలో ఎంతవరకు హామీలు నెరవేర్చారు?'