దేశానికి అన్నం పెట్టే రైతులు దిల్లీలో 30 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ.. కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ వర్ధంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'నెలైనా.. కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు!' - మాజీ ప్రధాని పీవీ
ఖమ్మం జిల్లా మధిరలో.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
'నెలైనా.. కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు!'
కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. అనంతరం అన్నదాతల ఆందోళనకు మద్దతుగా.. పార్టీ ఆధ్వర్యంలో రైతు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.