Khammam Collectorate besieged: లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కవితను వెంటనే అరెస్టు చేయాలని కలెక్టరేట్ ముట్టడి - Khammam latest news
Khammam Collectorate besieged: ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్‌ను భాజపా కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు చేయాలని ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు.
kmm
ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సారా కేసులు అని ఎస్టీ మహిళలను పోలీసులు అప్పట్లో వేధింపులకు గురిచేసి అరెస్టులు చేసేవారని... మరి ఇప్పుడు సారా కేసులో ఉన్న కవితను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: