తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫస్ట్ క్లాస్ నృత్యం - ఒకటో తరగతిలోనే 22 అవార్డులు సాధించిన అర్చన - ఖమ్మం తాజా వార్తలు

Khammam Classical Dancer Archana : సాధారణంగా ఒకటో తరగతి చదివే పిల్లలు ఏం చేస్తారు. మహా అయితే చిన్న, చిన్న పాఠాలు నేర్చుకుంటూ, ఆడుతూ, పాడుతుంటారు. అయితే ఈ చిన్నారీ మాత్రం ఏళ్లుగా సాధన చేస్తే కానీ నైపుణ్యం సంపాదించలేని శాస్త్రీయ నృత్యాన్ని అదరగొడుతోంది. పట్టుమని పదేళ్లు నిండకుండానే 9 రాష్ట్రాల్లోని కళావేదికలపై నాట్యమాడి ఎన్నో అవార్డులను గెలుచుకుంది. చదువులో చురుగ్గా రాణిస్తూనే సంగీత సవ్వడికి పాదాలతో లయ కలుపుతోంది. ఏడాదికి 153కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లిటిల్‌ ఛాంప్‌-2023ని సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన మూంజల అర్చనపై కథనం.

Classical Dance In Khammam
Archana Performing Classical Dance In Khammam

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 12:38 PM IST

సంప్రదాయ నృత్యాలలో అదరగొడుతున్న చిన్నారి అర్చన

Khammam Classical Dancer Archana :ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఉమ, శ్రీను దంపతుల కుమార్తె అర్చనకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పైన అమితాసక్తి. మూడేళ్ల వయసులోనే వినాయక చవితి, బతుకమ్మ పండుగలలో చూడముచ్చటగా నృత్యం చేసేది. అర్చన ఇంటి సమీపంలోని రాజరాజేశ్వరీ ఆలయంలో నిర్వహించే నృత్య తరగతులు, టీవీ, ఫోన్లో డ్యాన్స్‌ వీడియోలు చూస్తూ సాధన చేస్తుండేది. ఆమెకు నాట్యంపై ఉన్న ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు డ్యాన్స్‌ అకాడమీలో చేర్పించేందుకు ప్రయత్నించారు. అయితే చిన్నారి వయస్సు నాలుగేళ్లే కావటంతో కష్టమవుతుందని గురువు వారించినా పట్టుబట్టి నేర్చుకుంది.

Super Dance Winner Archana Khammam: సాధారణంగా 5-6 ఏళ్లు పట్టే భరతనాట్యం, పేరిణి శివతాండవంలోని పుష్పాంజలి వంటి అనేక సంప్రదాయ నృత్యాలను 2ఏళ్లలోనే అలవోకగా నేర్చుకుంది. మాస్టారు చెప్పే ముఖ కవళికలను, నాట్యభంగిమలను చూడ ముచ్చటగా చేసేది. ఎన్నో వేదికలపైన విశేష ప్రతిభ కనబరిచిన ఈ చిన్నారి భరత నాట్య, సంయుక్త, అసంయుక్త, హస్త ముద్రలను అలవోకగా చేసేస్తుంది. అర్చన తల్లి ఉమ ఇంటర్‌ వరకు జానపద నృత్యాలు చేసేది. ఆమెకు నాట్యం పైన మక్కువ ఉన్నా పెళ్లి తర్వాత అటు వైపు అడుగులు వేయలేక పోయింది. అదే ఆసక్తి తన కుమార్తెకు రావటంతో ఎంతో కష్టమైనా సరే నృత్యం శిక్షణ ఇప్పిస్తోంది. నృత్య ప్రదర్శనకు కావాల్సిన కాస్ట్యూమ్స్‌ని యూట్యూబ్‌లో చూసి తయారు చేసేది.

Nellore Girl Non Stop Dance: 12 కిలోమీటర్లు.. 3 గంటలు.. 21పాటలు.. ఆగకుండా బాలిక భరతనాట్యం...!

Srikanth Talent: ఈ తరం కోసం.. నాట్యం చేస్తూ కొండలు ఎక్కుతున్న శ్రీకాంత్​

Archana Performed In Maharashtra and Delhi : ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలకు తీసుకెళ్తూ అర్చన అభిరుచిని ప్రోత్సహిస్తున్నారు. చదువుతున్నది ఒకటో తరగతి అయినా ఇప్పటికే 22 అవార్డులు సాధించింది. ఏడాదిలోనే మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 153 ప్రదర్శనలు ఇచ్చింది. 52ముద్రలను కేవలం 24 సెకన్లలో చెప్పినందుకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ వచ్చింది. తక్కువ సమయంలో 100కి పైగా శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించినందుకు విశాఖపట్నం ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు వరించింది. చిన్న వయస్సులో అద్భుత ప్రదర్శనతో అర్చన ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. కనుమరుగైపోతున్న జానపద కళల్లో అర్చనను పెద్ద నృత్యకారిణీగా చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

"నాట్యం అంటే అర్చనకు చాలా ఇష్టం అందుకే ఎంత కష్టమైనా పాపను తీసుకెళ్లి నాట్యం నేర్పిస్తున్నాము. ఇటీవలే కదిరిలో అద్భుత నాట్య ప్రదర్శనకుగాను వండర్​ బుక్​ రికార్డ్​ వారు అర్చనను సత్కరించారు. తన అభిరుచిని గమనించి శిక్షణ ఇప్పిస్తున్నాము." - శ్రీను, అర్చన తండ్రి

'నాట్యం' చిత్రబృందానికి వెంకయ్యనాయుడు, బాలయ్య ప్రశంసలు

'సంగీతం, సినిమా, నాట్యం, మిమిక్రీ.. ఏ రంగమైన రాణించడమే ఆమె లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details