ఖమ్మం నగరపాలక సంస్థ సర్వసభ్యసమావేశం రసాభాసగా కొనసాగింది. నగర సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు చెవిలో పూలు పెట్టుకుని ఆందోళన చేశారు. పాలక పక్షం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో నిరసనల మధ్యే మొత్తం 45 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
ఖమ్మం నగరపాలక సమావేశం రసాభాస - ఖమ్మం నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస
సమస్యలు పరిష్కరించడంలో పాలక పక్షం విఫలమైందంటూ ఖమ్మం నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు నిరసన తెలిపారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఖమ్మం సర్వసభ్య సమావేశం