Khammam BRS Election Plan 2023 :2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి-అప్పటి టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లోఖమ్మం నుంచి ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్(Minister Puvvada Ajay) మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లాలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది.
Telangana Assembly Elections 2023 : గత రెండు ఎన్నికలతో పోలిస్తే జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నారు. పాలేరు టికెట్((BRS MLA Ticket 2023) ఆశించి భంగపడటంతో ఇటీవల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు.
BRS focus on Khammam Politics 2023 :ఈ పరిణామాల నడుమే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించినబీఆర్ఎస్.. పటిష్ఠ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక్కరు మినహా మిగిలిన 9 స్థానాల్లో సిట్టింగులకే అవకాశం కల్పించింది. ఎన్నికల క్రతువుపై మరింత దూకుడు పెంచేందుకు గానూ ఇటీవల జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తర సమరం.. అసెంబ్లీ పోరుకు సై అంటే సై
Khammam Politics 2023 :తాజాగా మరో అడుగు ముందుకేసినబీఆర్ఎస్ అధిష్ఠానం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ముఖ్యనేతలను ఇంఛార్జీలుగా నియమించింది. మధిరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంఛార్జిగా నియమితులవగా.. సత్తుపల్లికు బండి పార్థసారధి రెడ్డి, భద్రాచలానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు ఎంపీ నామా నాగేశ్వరరావును పార్టీ నియమించింది.