తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి పెను విషాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు

పాపికొండల పెను విషాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. నేలకొండపల్లికి చెందిన రేపాక విష్ణు కుమార్​ ఆచూకీ గురించి రాజమండ్రి వెళ్లి నిర్ధరించుకుంటామని బంధువులు తెలిపారు.

ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు

By

Published : Sep 16, 2019, 5:04 AM IST

Updated : Sep 16, 2019, 7:55 AM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన గోదావరి నది ప్రమాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన రేపాక విష్ణు కుమార్ హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన భార్య, నాలుగు నెలల బాబును ఖమ్మం ఇందిరా నగర్​లోని అత్తవారింట్లో దించి వెళ్లాడు. ఆదివారం ఉదయం తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి రాజమండ్రిలో ఉన్నట్టు విష్ణు తెలిపాడు. గోదావరి ఒడ్డు ఫొటోలు వాట్సాప్​లో పంపించాడు. గోదావరిలో లాంచీ ప్రమాదం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చరవాణికి ఫోన్ చేయగా అందుబాటులో లేదు. ప్రసార మాధ్యమాలు లాంచ్ మునిగిపోయే ముందు ఓ యువకుడు తీసిన చిత్రంలో విష్ణుకుమార్ కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమండ్రికి ఫోన్ చేస్తే తన అల్లుడు సేఫ్​గా ఉన్నాడన్నారని మామ కొండలరావు పేర్కొన్నారు. ఆందోళనగా ఉందని రాజమండ్రి వెళ్లి నిర్ధరణ చేసుకుంటామని వారు తెలిపారు.

ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు
Last Updated : Sep 16, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details