తెలంగాణ

telangana

ETV Bharat / state

Khammam BC Gurukul Boys School Controversy : ప్రశ్నించడమే శాపమైంది.. ఆ విద్యార్థులను చదువుకు దూరం చేసింది

Khammam BC Gurukul Boys School Controversy : సమస్యలపై గళం విప్పిన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు.. చదువుకు దూరమయ్యారు. భోజనం సరిగ్గా పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు.. ఇతర గురుకులాలకు తరలించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి చదువుతున్న చిన్నారులను చదువుకు దూరం చేయడం సరికాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Khammam BC Gurukula School Problems
Khammam BC Gurukula Boys School Controversy

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 8:06 AM IST

Khammam BC Gurukul Boys School Controversy సమస్యలపై గళం విప్పడమే శాపమైంది విద్యార్థులను చదువుకు దూరం చేసింది

Khammam BC Gurukul Boys School Controversy : ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని బీసీ గురుకుల బాలుర పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. భోజనం సరిగా లేదని చెబితే.. కొత్తగా వచ్చిన వార్డెన్ చిత్రహింసలకు గురి చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమస్యపై ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ధైర్యం చేసి.. అర్ధరాత్రి గోడ దూకి కలెక్టరేట్‌కు వెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న సిబ్బంది.. వారిని తిరిగి గురుకులానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం 24 మందిని వైరా, బొనకల్లు, కుంపర్తి, కూసుమంచి బీసీ గురుకులాలకు తరలించారని విద్యార్థులు చెబుతున్నారు.

Khammam BC Gurukula School Problems : పిల్లలపై చర్యలు తీసుకోవడంలో తన ప్రమేయం లేదని రఘునాథపాలెం బీసీ గురుకులం ప్రిన్సిపల్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారి సూచన మేరకు తిరిగి విద్యార్థులను గురుకులంలో చేర్చుకుంటామని.. అప్పటి వరకు వారిని పంపిన గరుకులాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.

విద్యార్థులను ఇతర గురుకులాలకు తరలించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎలా తరలిస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు. వెంటనే తమ చిన్నారులను ఖమ్మం రఘునాథపాలెం గురుకులానికి తీసుకురావాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుండా.. వారినే దోషులుగా తేల్చి శిక్షించడం సరికాదంటూ మండిపడుతున్నారు. భోజనం పెట్టలేదని అడిగినందుకే శిక్షించారని.. తమ బాధను కలెక్టర్‌కు చెప్పేందుకు వెళ్లినందుకు చదువుకు దూరమయ్యేలా చేశారని విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎలుకలు.. విద్యార్థులకు తిప్పలు!

ఇదీ అసలు సమస్య.. : ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెంలోని ఓ పాత ఇంజినీరింగ్‌ కళాశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక్కడ పదో తరగతి వరకు తరగతులు నడుస్తున్నాయి. పాత భవనంలో నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భోజనం సరిగా లేదని చెబితే.. కొత్తగా వచ్చిన వార్డెన్‌ అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులను దుస్తులు విప్పించి.. గ్రౌండ్‌లో నిల్చోబెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యను బీసీ ఆర్సీవోకు చెప్పినా పట్టించుకోకపోవడంతో చివరకు ధైర్యం చేసి రాత్రి సమయంలో గోడ దూకి కలెక్టరేట్‌ వరకు వెళ్లామని.. విషయం తెలుసుకున్న గురుకుల సిబ్బంది తిరిగి గురుకులానికి తీసుకువచ్చారని తెలిపారు. అప్పటి నుంచి మొత్తం 24 మంది విద్యార్థులను విభజించి వైరా, బొనకల్లు, కుంపర్తి, కూసుమంచి బీసీ గురుకులాలలకు తరలించారని వాపోతున్నారు. గత పది రోజులుగా ఆయా గురుకులాల్లోనే ఉంటున్నామని.. చదువుకునే అవకాశం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Teacher overaction in AP: ఉపాధ్యాయుడి అత్యుత్సాహం.. విద్యార్థినులకు అస్వస్థత

Girls Gurukul College Problems in Mahabubnagar : శిథిలావస్థకు చేరిన గురుకులం.. బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థినులు

ABOUT THE AUTHOR

...view details