వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భారీ మోజార్టీతో గెలిపించుకుంటామని పాలేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్ అభిమాని అర్జున్‌బాబు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఇవాళ వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల 9న పార్టీ ప్రకటన తర్వాత పాలేరు నియోజకవర్గానికి రావాలని అభిమానులు ఆమెను కోరారు.
పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల - ఖమ్మం జిల్లా వార్తలు
వైఎస్ షర్మిలను ఖమ్మం జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులు కలిశారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పినట్లు వైఎస్‌ఆర్ అభిమానులు వెల్లడించారు.
![పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల khamma ysr fans met with sharmila in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11139706-thumbnail-3x2-sharmila.jpg)
షర్మిలను కలిసిన ఖమ్మం జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులు
అందుకు షర్మిల తప్పుకుండా వస్తానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. పోటీపై స్పందించిన షర్మిల.... వైఎస్ఆర్కు పులివెందుల ఎలాగో... తనకు పాలేరు నియోజకవర్గం అలాగే అని చెప్పారని ఆయన వివరించారు. ఏప్రిల్ 9న నిర్వహించనున్న సభకు దాదాపు లక్షకు పైగా హాజరవుతారన్నారు.
ఇదీ చదవండి:గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి: మంత్రి సత్యవతి
Last Updated : Mar 24, 2021, 7:07 PM IST