స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస తన సత్తా చాటింది. ఖమ్మం జిల్లాలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కారు జోరు కొనసాగించింది. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలకు గానూ... 17 స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా... 3 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. 289 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 167 స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకోగా... 58 స్థానాలను హస్తం పార్టీ, 05 స్థానాలను తెదేపా గెలిచింది. 17 స్థానాలను వామపక్షాలు గెలుచుకున్నాయి. ఇతరులు 42 స్థానాల్లో గెలుపొందారు.
గులాబీ గుబాళించిన సందర్భాన గ్రామగ్రామాన... తెరాస శ్రేణులు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. ర్యాలీలు, నృత్యాలతో విజయానందం పొందారు.