తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Calls Joint Khammam District BRS Candidates : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బీఆర్​ఎస్​ అభ్యర్థులకు కేసీఆర్‌ పిలుపు - బీఆర్​ఎస్​ నాయకుల మీటింగ్​

BRS Leaders Meeting at Pragathi Bhavan
KCR Meeting at Pragathi Bhavan

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 1:07 PM IST

Updated : Aug 26, 2023, 3:10 PM IST

13:04 August 26

ప్రగతిభవన్‌లో సమావేశానికి రావాలని కేసీఆర్‌ పిలుపు

KCR Calls Joint Khammam District BRS Candidates: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే బీఆర్ఎస్​ అధిష్ఠానం ఉభయ జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తుమ్మల రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందన్న చర్చ ఊపందుకుంది. తుమ్మల పార్టీ మారతారా.. ఏ పార్టీలోకి వెళ్తారు..? స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనే అంశాలపై రాజకీయ ప్రముఖుల్లో చర్చకు దారి తీస్తోంది.

BRS Leaders Meeting at Pragathi Bhavan: ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్​ఎస్​ నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపువచ్చింది. వెంటనే ప్రగతి భవన్‌కు రావాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బీఆర్​ఎస్​ అభ్యర్థులను ఆయన ఆదేశించారు. సాయంత్రం ఖమ్మం బీఆర్​ఎస్(BRS)​ నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఖమ్మం రాజకీయ పరిణామాలపై కేసీఆర్​ బీఆర్​ఎస్​ నాయకులతో చర్చించనున్నారు. ఏ అంశాలపై చర్చిస్తారో? ఖమ్మంలో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి ప్రకటన ఉంటుందన్నది పార్టీ వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్​గా మారింది.

Thummala MLA Ticket Issue : తుమ్మల పార్టీ మారతారా..! మారితే ఎందులోకి..? మారకపోతే నెక్ట్స్​ ఏంటి..?

వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన తుమ్మల: మాజీ మంత్రి తుమ్మల(Thummala) శుక్రవారం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కారులతో ర్యాలీ నిర్వహించారు. నాయకన్​ గూడెం నుంచి సుమారు 30 కిలో మీటర్లు అధిక సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ప్రారంభం నుంచి ఖమ్మం జిల్లాలోని తన నివాసం వరకు ఓపెన్ టాప్ కారులో ప్రదర్శనగా వెళ్తు.. వచ్చిన కార్యకర్తలకి, ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు 6 గంటల పాటు ఈ భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కొన్నిచోట్ల కార్యకర్తలు తుమ్మల జెండాలతో పాటు కాంగ్రెస్​ జెండాలు పట్టుకోవడంతో రాజకీయ నిపుణులకి ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. గతంలో తాను రాజకీయాలు అవసరం లేదని అనుకున్నారని.. ప్రస్తుతం ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటారని ప్రకటించారు. రాజకీయాల్లో ఎన్నోసార్లు కిందపడిన ప్రజలు మళ్లీ తనను నిలబెట్టారని గుర్తు చేశారు. తనని నమ్ముకున్న కార్యకర్తల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులు మరింత వేడి వాతావరణాన్ని సృష్టించాయి. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనే అంశంపై కార్యకర్తలు ఆసక్తితో ఉన్నారు. ఈ విషయాలను చర్చించేందుకే బీఆర్​ఎస్​ పార్టీ అధినేత కేసీఆర్​ ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశానికి పిలుపునిచ్చారు.

Governor Tamilisai visited Secretariat Photos : సచివాలయం కలియ తిరిగిన గవర్నర్.. దగ్గరుండి చూపించిన కేసీఆర్.. ఫొటోలు చూశారా..?క్తి నెలకొంది.

Telangana Cabinet Expansion Tomorrow : రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..

CM KCR Suryapet Tour Today : నేడు సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన​.. 'ప్రగతి నివేదన సభ' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Last Updated : Aug 26, 2023, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details