ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కార్తిక సోమవారం పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు శివలింగానికి పంచామృతాలు, నవరసాలతో అభిషేకాలు జరిపారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు కార్తిక సోమవారం భజనలు చేశారు.
భక్తులతో కళకళలాడుతున్న శివాలయాలు - devotees rush shivalayam
కార్తిక సోమవారం పురస్కరించుకుని శివాలయాలు కళకళలాడాయి. ఉదయం నుంచే మహిళలు దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులతో కళకళలాడుతున్న శివాలయాలు