తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత ఖర్చుతో అంబులెన్స్​లు సమకూర్చిన నామ - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం ఎంపీ, తెరాస లోక్​సభా పక్షనేత నామ నాగేశ్వర​ రావు ఉమ్మడి జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించండం కోసం తన సొంత ఖర్చుతో ఆరు ఆంబులెన్స్​లను సమకూర్చారు. వాటిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ చేతుల మీదుగా ప్రారంభించారు.

kammam mp nama nageswarrao provide ambulance  at own cost
సొంత ఖర్చుతో అంబులెన్స్​లు సమకూర్చిన ఎంపీ

By

Published : Jan 11, 2021, 3:43 PM IST

Updated : Jan 11, 2021, 5:03 PM IST

తెరాస లోక్​సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర​ రావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ. 1.23కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్​లను అందించారు. ఆ వాహనాలను ప్రగతి భవన్​లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జెండా ఊపి ప్రారంభించారు.

సొంత ఖర్చుతో అంబులెన్స్​లను ఏర్పాటు చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావును రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, పువ్వాడ అజయ్​ అభినందించారు. ఈ వాహనాలను ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో గల ప్రభుత్వ ఆసుపత్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందజేస్తామని ఎంపీ తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమయం వృధా కాకుండా బాధితులను నిర్ణీత (గోల్డెన్ అవర్) సమయంలో హాస్పిటల్​కు తరలించడంతో పాటుగా క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. సోమవారం సాయంత్రానికి ఈ వాహనాలు ఖమ్మం చేరుకోనున్నాయి.

అత్యాధునిక సదుపాయాలు

క్షతగాత్రులను తరలించే క్రమంలో వారికి ప్రాణాపాయం నుంచి కాపాడడానికి ఆక్సిజన్, వెంటిలేటర్​తో సహా అత్యాధునిక సదుపాయాలు ఈ అంబులెన్స్​లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆరు అంబులెన్స్​లను అందించడం పట్ల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఫోర్స్ మోటార్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సొంత ఖర్చుతో అంబులెన్స్​లు సమకూర్చిన నామ

ఇదీ చదవండి:సీఎం ఫొటో లేదని బ్రోచర్ ఆవిష్కరణకు తిరస్కరించిన మంత్రి

Last Updated : Jan 11, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details