దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే అద్భుతమైన పథకం కల్యాణ లక్ష్మి అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో అర్హులైన 61 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
'నేరుగా లబ్ధిదారులకు అందే అద్భుతమైన పథకం కల్యాణ లక్ష్మి' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లా సింగరేణిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందజేశారు.
'నేరుగా లబ్ధిదారులకు అందే అద్భుతమైన పథకం కల్యాణ లక్ష్మి'
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ రాజశేఖర్, జడ్పీటీసీ జగన్, ఎంపీపీ శకుంతల, తహసీల్దార్ పుల్లయ్య, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ