తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా జమలాపురం వేంకటేశ్వర స్వామి కల్యాణం - జమలాపురం వేంకటేశ్వర స్వామి కల్యాణం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం కమణీయంగా జరిపించారు. కరోనా ప్రభావం వల్ల భక్తులు లేకుండానే వేడుక నిర్వహించారు.

Jamalapuram Venkateswara Kalyanam
వైభవంగా జమలాపురం వేంకటేశ్వర స్వామి కల్యాణం

By

Published : Apr 1, 2020, 4:58 PM IST

తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త కుప్పల వెంకట జయదేవ శర్మ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు.

విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం రక్షా బంధన పూజ, పాద ప్రక్షాళన, కన్యాదానం, మాంగల్యధారణ వంటి వైదిక క్రతువులను వేదమంత్రాల నడుమ జరిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ మూల్పూరు స్వప్న శ్రీనివాస రావు దంపతులు స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కరోనా నేపథ్యంలో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులను అనుమతించలేదు.

వైభవంగా జమలాపురం వేంకటేశ్వర స్వామి కల్యాణం

ఇదీ చూడండి:కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం

ABOUT THE AUTHOR

...view details