ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం రహదారుల అభివృద్ధి కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఐటీ హబ్‌ను ప్రారంభించారు. ఐటీ హబ్‌లోని అన్ని అంతస్తులు తిరిగి పరిశీలించారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.
పువ్వాడ ఉండటం అదృష్టం
ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖమ్మానికి మించిన మున్సిపల్ కార్పొరేషన్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర మేయర్లను ఖమ్మం పంపి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించమని చెబుతానని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి పువ్వాడ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు పూర్తి చేయించుకున్నారని తెలిపారు. పువ్వాడ వంటి ప్రజాప్రతినిధి ఉండటం ఖమ్మం ప్రజల అదృష్టమన్నారు.
ఫేజ్-2 కోసం రూ.20 కోట్లు
ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఐటీ హబ్ ఫేజ్-2 కోసం రూ.20 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం యువత ఐటీ హబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం ఐటీ హబ్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
అదే మా విధానం
ఖమ్మంలో పీవీ విగ్రహం ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని కేటీఆర్ చెప్పారు. నిరంతరం నేర్చుకోవడం అన్నది పీవీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడులో ఫుడ్‌పార్క్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఖమ్మం రహదారుల అభివృద్ధి కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలనేది తమ విధానమని కేటీఆర్ స్పష్టం చేశారు.
త్వరలోనే ఖమ్మం ఐటీ హబ్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం : కేటీఆర్ ఇదీ చదవండి :ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్