ఆర్టీసీ కార్మికులు ఇన్నీ నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకుండా పోలీసులతో హింసకు పాల్పడటం అమానుషమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకపోవడం అమానుషం - పోలీసులతో హింసకు పాల్పడటం అమానుషమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.
విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకపోవడం అమానుషం
ఆర్టీసీ వ్యవహారంపై అనేక మార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని.. ఈ అంశంలో రహస్య ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు కాజేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకోసమే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని రూట్లు జాతీయం చేస్తామన్నారు.
ఇదీ చూడండి : బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన అనుచరులపై కేసు