తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐటీ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి' - ఐటీ విస్తరణతో ఉపాధి అవకాశాలు మెరుగు

ఖమ్మం ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంకల్పాన్ని ఐటీ రంగ ప్రముఖులు కొనియాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఐటీ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ హబ్‌ల లక్ష్యాలపై ఖమ్మం ఐటీ హబ్ కోసం వచ్చిన ప్రతినిధులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

IT expansion will increase employment opportunities in khammam
'ఐటీ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి'

By

Published : Dec 7, 2020, 4:43 AM IST

హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని... రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్న ప్రభుత్వం సంకల్పం అభినందనీయమని... ఐటీ రంగ ప్రతినిధులు అన్నారు. రానున్న రోజుల్లో ఐటీ రంగమంటే కేవలం పెద్దపెద్ద నగరాలు, పట్టణాలే కాదు. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆ దిశగా ప్రభుత్వం ఐటీ రంగాన్ని విస్తరిస్తున్న తీరు బాగుందన్నారు. కేవలం హైదరాబాద్​కు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మెచ్చుకున్నారు. ఖమ్మం ఐటీ హబ్‌కు ఇప్పటికే 19 కంపెనీలు వచ్చాయని వెల్లడించారు.

ఇప్పుడు సాఫ్ట్​వేర్​ ఉద్యోగాల కోసం హైదరాబాద్​, బెంగళూరు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 860 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని.. రానున్న రోజుల్లో మరికొంత మందికి అవకాశం ఉంటుందని ఐటీ రంగ ప్రతినిధులు వివరించారు.

ఇదీ చూడండి :అనిశాకు దొరికిన డీఎస్పీ.. 2 కోట్లుకుపైగా అక్రమాస్తులు

ABOUT THE AUTHOR

...view details