వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ.. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని తెలంగాణ జానపద కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఏర్పాటు చేసిన సదస్సులో సంఘం నాయకులు పాల్గొన్నారు. కళాకారులకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని వయో పరిమితి దాటిన వారికి పింఛన్ ప్రకటించాలని కోరారు. 6 నెలలకోసారి కాకుండా వయోపరిమితి దాటగానే పింఛను దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వైరాలో వృద్ధ కళాకారులకు పెండింగ్లో ఉన్న పింఛను విడుదల చేయాలని ప్రదర్శన చేపట్టారు.
'వృద్ధ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి' - ఖమ్మం
వృద్ధ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూరులో ప్రదర్శన నిర్వహించారు.
కళాకారులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టండి