Chilli crop in Khammam: మిర్చిలో చీడపీడల నివారణ మార్గాలు - ఖమ్మం వార్తలు
Chilli crop in Khammam: రాష్ట్రంలో మిర్చి సాగుచేస్తున్న అన్నదాతలకు ప్రస్తుతం మరో కొత్త కష్టమొచ్చిపడింది. దిగుబడి వస్తున్న సమయంలో తెగులు సోకిన మిరప పైర్లను చూసి బోరుమంటున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వందల ఎకరాల్లో మిర్చి పంట తెగుళ్ల బారిన పడింది.
![Chilli crop in Khammam: మిర్చిలో చీడపీడల నివారణ మార్గాలు mirchi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13832630-806-13832630-1638790520225.jpg)
mirchi
Chilli crop in Khammam: మిర్చి తోటలపై పడగవిప్పిన తామర పురుగు ఉద్ధృతి పంటల్ని పీల్చిపిప్పి చేస్తోంది. ఆశల పంట కళ్లముందే ఆవిరవుతుంటే చూసి తల్లడిల్లుతున్న అన్నదాతలు.. ఆ పంటను కాపాడుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. పంటపై ఆశలు కోల్పోయి తోటలు పీకేస్తున్న వారు కొందరైతే... కాపాడుకునేందుకు వేలు ధారపోసి పురుగుమందులు పిచికారీ చేస్తున్నవారు ఇంకొందరు.. ఈ సమయంలో పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమంత్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమంత్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి