ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల ఇల్లూరు, ఏపీలోని కొనతమాత్మకూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మధిర నుంచి ఖమ్మంకు వెళ్లే దారిలో కృష్ణాపురం సమీపాన పాలవాగు పొంగి రహదారి మునిగిపోయింది.
ఎడతెరిపి లేని వర్షం.. రాకపోకలకు అంతరాయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మధిర నుంచి ఖమ్మంకు వెళ్లే దారిలో కృష్ణాపురం సమీపాన పాలవాగు పొంగి రహదారిపైకి వరద చేరింది.
ఎడతెరిపి లేని వర్షం
దేశినేనిపాలెం, మాటూరు, సిరిపురం గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. మడుపల్లి, అల్లినగరం గ్రామాల మధ్య వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం నుంచి ఏపీ సరిహద్దు గ్రామమైన అన్నవరం గ్రామాల మధ్య దానయ్య వాగు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మధిరలోని హనుమాన్ కాలనీ, ముస్లిం కాలనీ, రాఘవాపురం, లడక్ బజార్ రోడ్డు ప్రాంతాల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడం వల్ల ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
- ఇదీ చదవండి :మధిరలో ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు