ఖమ్మం జిల్లా వైరాలో ఠాగూర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎంవీఐ శంకర్‌నాయక్, సీఐ వసంత్‌కుమార్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు - ఇంటర్ విద్యార్థులు వీడ్కోలు వేడుకలు
ఖమ్మం జిల్లా వైరాలో ఠాగూర్ విద్యాసంస్థల్లోని ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక సీఐ వసంత్‌కుమార్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
![అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు intermediate students farewell day celebrations in khammam vira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6206033-62-6206033-1582692027070.jpg)
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కన్నవారి కలలను సాకారం చేయాలని సీఐ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ఇదీ చూడండి :'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'