ఖమ్మం జిల్లా వైరాలో విషాదం చోటుచేసుకొంది. ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయవాడలో చదువుతున్న ముజహర్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర కడుపునొప్పిని తట్టుకోలేక ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - ఖమ్మంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా వైరాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి తట్టుకోలేక ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎంతసేపటికి గదిలోనుంచి బయటకు రాకపోవడం వల్ల అనుమానమొచ్చిన తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూశారు. విగత జీవిగా కుమారుడిని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి