తమ స్థలాలు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెం వద్ద దీక్షకు దిగారు. గతంలో ఖమ్మం నగరానికి చెందిన పేదలకు 2013లో శివాయిగూడెం పంచాయతీ పరిధిలో పట్టాలు ఇచ్చారు.
తమ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ దీక్ష - ఖమ్మం జిల్లా శివాయిగూడెం తాజా వార్తలు
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయి గూడెం వద్ద తమ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ బాధితులు దీక్ష చేపట్టారు. తమకు 2009లో భూములు చూపించి.. 2013లో పట్టాలు ఇచ్చారని బాధితులు అంటున్నారు. మూడు నెలల నుంచి తమ ప్లాట్లు కోసం తిరిగినా పట్టించుకునేవారు లేరని పేర్కొన్నారు. పట్టా ఇచ్చిన తర్వాత తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ దీక్ష
ఎటువంటి వసతులు లేకపోవడం వల్ల పేదలు ఇళ్లు నిర్మించుకోలేదు. ప్రభుత్వం ఆ పట్టాలు రద్దు చేసింది. లబ్ధిదారులు అందరూ మా స్థలాలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి :మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు