గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి ఉన్న అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు బ్యారేజీగా మార్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తోంది. ఐదారు టీఎంసీలను అదనంగా నిల్వ చేయడం ద్వారా సీతారామ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వేసవిలో తాగునీటికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
'దుమ్ముగూడెం ఎత్తు పెంపు సీతారామ ఎత్తిపోతలకోసమే' - DHUMMUGUDEM
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టను 4 నుంచి 5 మీటర్ల వరకు ఎత్తు పెంచితే అదనంగా ఐదారు టీఎంసీలు నిల్వచేయొచ్చని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. మెుత్తం మీద 8 టీఎంసీల వరకు నిల్వ ఉంచడానికి గల అన్ని అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
దుమ్ముగూడెం ఆనకట్టను 4 నుంచి 5 మీటర్ల వరకు ఎత్తు పెంచాలి