తెలంగాణ

telangana

ETV Bharat / state

కోరట్లగూడెంలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. లారీ సీజ్ - అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోరట్లగూడెంలో 50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు.

Illegal Ration rice transport to Other states from Khammam district
ఖమ్మంలో గుట్టు చప్పుడు కాకుండా రేషన్ దందా

By

Published : Jul 9, 2020, 8:01 PM IST

రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజురోజుకూ విస్తృతం అవుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో అక్రమ రేషన్​ బియ్యం దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్​ కాకినాడకు అక్రమంగా లారీలో 50 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.

పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఊరి చివర్లో కేంద్రాలు ఏర్పాటుచేసి అక్కడి నుంచి లారీల్లో తరలిస్తున్నారని చెప్పారు. పోలీసులు లారీని సీజ్​ చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details