తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఐజీ పర్యటన.. లాక్​డౌన్​ అమలు తీరు పరిశీలన - lockdown in khammam

ఐజీ నాగిరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ విధించిన లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

lockdown in khammam, khammam lockdown
లాక్​డౌన్, ఖమ్మంలో లాక్​డౌన్

By

Published : May 23, 2021, 3:12 PM IST

వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఖమ్మంలో పర్యటించారు. నగరంలో లాక్​డౌన్​ అమలును పరిశీలించారు. సీపీ విష్ణు వారియర్​తో కలిసి నగరంలోని పోలీస్ చెక్ పాయింట్లను పరిశీలించారు. లాక్​డౌన్ ప్రారంభమైన తర్వాత వీధుల్లో తిరిగి, సిబ్బందితో మాట్లాడారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనేందుకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అనవసరంగా రోడ్డుపైకి వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details