ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి, కారేపల్లి మండలాల్లో వేలాది మంది వలస కూలీలు ఈదురు గాలులు, వర్షానికి ఉన్న నీడను కోల్పోయారు. వర్షంలో పిల్లలను తీసుకుని సమీప గ్రామాలకు పరుగులు పెట్టారు.
కూలిన గుడిసెలు... గాలిలో బతుకులు - HEAVY RAIN IN BHADRADRI
అకాల వర్షాల వల్ల రైతులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా నానా అవస్థలు పడుతున్నారు. పరదాలతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలు కాస్తా... ఈదురు గాలులకు నేలమట్టమవుతున్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావంతో తమ ప్రాంతాలకు వెళ్లలేక... ఇక్కడ ఉండలేక.. మనోవేదనతో ఉన్న కూలీలకు వర్షాలు మరింత ఇబ్బందిగా మారాయి.
![కూలిన గుడిసెలు... గాలిలో బతుకులు HUTS COLLAPSED DUE TO HEAVY RAIN IN KHAMMAM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6988979-733-6988979-1588161058863.jpg)
కూలిన గుడిసెలు... గాలిలో బతుకులు
మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, తమ వద్ద ఉన్న సరుకులు కూడా పాడయ్యాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలులు, వర్షపు నీటి బురదతో తమ బతుకులు దయనీయంగా మారాయని గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా తమ ప్రాంతాలకు పంపించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.