Mirchi rush at Khammam Market yard: ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా తరలివచ్చింది. రెండు రోజుల తర్వాత మార్కెట్ తెరవటంతో అధిక సంఖ్యలో మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు మిరపను తరలించారు.
మొదటి గంటలో మందకొడిగా ప్రారంభమైన కొనుగోళ్లు ఆ తర్వాత జోరందుకున్నాయి. జెండా పాట క్వింటాకు రూ. 19 వేలు నిర్ధరించిన వ్యాపారులు... కనిష్ఠంగా రూ. 17 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒక్క రోజే సుమారు 80 వేల బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.