కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం ఖమ్మం వాసులు బారులు తీరారు. పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం వద్దకు భారీగా తరలి వచ్చారు. ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా లైన్లలో వేచి ఉన్నారు. అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్ట లేదని అసహనం వ్యక్తం చేశారు.
బస్టాండ్‌లో కరోనా పరీక్షల కోసం జనం బారులు
ఆర్టీసీ బస్టాండ్‌లో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ప్రజలు ఇలా ఎగబడ్డారు. అందరూ ఒక్కసారిగా తరలిరావడంతో వారిని అదుపుచేయడం సిబ్బందికి కష్టంగా మారింది. ఖమ్మం ఆర్టీసీ ఆవరణలో కొవిడ్ టెస్ట్ సెంటర్ వద్ద ఆదివారం ఇలా బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.
కరోనా పరీక్షల కోసం బారులు తీరిన ప్రజలు
ఉదయం 5 గంటల నుంచే వరసలో నిలుచున్నా టోకెన్లు ఇవ్వడం లేదని కొందరు ఆరోపించారు. వందలాది మంది ఒకేసారి పరీక్షలకోసం తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. తగినన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.