తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రి సీజ్​ - hospital seized

వైరాలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రిని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సీజ్​ చేశారు. అనుమతి లేకుండా చికిత్సలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా వైద్యాధికారి మాలతి హెచ్చరించారు.

hospital seized in vyra in khammam district
అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రి సీజ్​

By

Published : Oct 17, 2020, 10:12 AM IST

ఖమ్మం జిల్లా వైరాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఆసుపత్రిని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు బస్టాండ్‌ సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అమాయకులను మోసం చేస్తూ వచ్చిరాని వైద్యం చేస్తున్నాడని, అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్నాడని మండల వైద్యాధికారి శశిధర్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఆ వైద్యశాలను తనిఖీ చేయగా అతడి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆ విషయాన్ని వైద్యాధికారి డీఎంహెచ్‌వోకు సమాచారం ఇచ్చాడు. జిల్లా వైద్యాధికారి మాలతి ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, చికిత్సలు చేసినా చట్ట విరుద్ధమని, కఠిన చర్యలు చేపడతామని డీఎంహెచ్‌వో హెచ్చరించారు.

ఇవీ చూడండి: వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలి: డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details