భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని శ్రీహరిహర క్షేత్రంలో కరోనా నుంచి ప్రజలకు విముక్తి, సుఖశాంతులతో ఉండాలని గణపతి హోమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గూగులోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
కరోనా నుంచి విముక్తి కోసం హోమం - yellandu latest news today
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని హరిహర క్షేత్రంలో నిర్వహించిన గణపతి హోమంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పాల్గొన్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి, సుఖశాంతులతో ఉండాలని హోమం చేపట్టారు.
కరోనా నుంచి విముక్తి కోసం హోమం నిర్వహణ
పూజకు విచ్చేసిన కమిషనర్‌ను దేవాదాయ శాఖ తరపున అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మస్తాన్ రావు, ఆలయ ఛైర్మన్ కొప్పురావురి భాస్కర్, దేవాదాయ రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు