ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని తండాల్లో హోలీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లోక్యాతండా, కోక్యా తండాలో హోలీ సంబురాలు 3 రోజులపాటు జరుగనున్నాయి. మొదటి రోజు కోలాటం రెండో రోజు కాముడి దహనం, మూడో రోజు రంగులు చల్లుకుని ధూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తండాల్లో హోలీ వేడుకలు - VERITY OF HOLI CELEBRATIONS
హోలీ సంబురాలంటే రంగులు చల్లుకోవాటమే కాదు... అదో పెద్ద పండుగ వారికి. మూడు రోజుల పాటు బంధువులతో ఊరంతా జాతర సాగుతుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యాతండా, కోక్యా తండాల ప్రజలు ఎంతో ఘనంగా హోలీని నిర్వహించుకుంటారు.
![తండాల్లో హోలీ వేడుకలు HOLI CELEBRATIONS IN KUSUMANCHI MANDAL LOKYATHANDA AND KOKYA THANDA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6345838-thumbnail-3x2-ppp.jpg)
HOLI CELEBRATIONS IN KUSUMANCHI MANDAL LOKYATHANDA AND KOKYA THANDA
మొదటి రోజు ఘనంగా కోలాట నృత్య ప్రదర్శన చేపట్టారు. హోలీ పండగకు ఎక్కడ ఉన్నా అందరూ తమ గ్రామానికి చేరుకొని పండుగను ఘనంగా నిర్వహిస్తారు. పండుగకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు కొత్తబట్టలు కొంటారు. ఇంటికి ఒక మేకను బలి ఇచ్చి భోజనాలు పెడతారు. రెండో రోజు కాముడు దహనం చేసి.... అనంతరం ఆ బూడిదను ఊరంతా చల్లుతారు. మూడో రోజు ధూమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. మూడో రోజునే చిన్న పిల్లలకు పేర్లు పెట్టి అన్నప్రాసన కూడా చేస్తారు.
ముచ్చటగా మూడు రోజులు... తండాల్లో ఘనంగా హోలీ వేడుకలు