రంగుల పండుగ హోలీని ఖమ్మం జిల్లా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో చిన్నారులు తమ స్నేహితులకు రంగులు పూసుకుంటు తిరిగారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా హోలీ సంబురాల్లో పాల్గొని... పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఉత్సాహంగా రంగుల పండుగ హోలీ వేడుకలు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుని... పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొవిడ్ నిబంధనలు ఉన్నందున జిల్లాలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు సంబురాలకు దూరంగా ఉన్నారు.
![ఉత్సాహంగా రంగుల పండుగ హోలీ వేడుకలు holi celebrations in khammam district, Holi celebrations in accordance with the Kovid rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11202019-881-11202019-1617011307651.jpg)
హోలీ వేడుకలు జరుపుకుంటున్న ఖమ్మం జిల్లా మహిళలు, ఖమ్మం జిల్లా హోలీ వార్తలు
కొన్ని ప్రాంతాల్లో డిజే పాటలను ఏర్పాటు చేసుకుని... నృత్యాలు చేస్తూ ఉత్సహంగా గడిపారు. కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు వేడుకలకు దూరంగా ఉన్నారు.
ఇదీ చదవండి: నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్