తెలంగాణ

telangana

ETV Bharat / state

కోలాటం వేస్తూ అన్నప్రాసన.. పండుగకు 'దండు' కదిలింది.! - హోలీ రోజు అన్నప్రసాన

సాధారణంగా హోలీ రోజు రంగులు చల్లుకుంటూ హోళీ జరుపుకుంటారు. కానీ ఇక్కడ కోలాటం వేసుకుంటూ పిల్లలకు అన్నప్రసాన చేస్తారు. ఖమ్మం జిల్లా లోక్యా తండాలో నిర్వహించిన దండు వేడుకలు మనం కూడా చూద్దాం పదండి.

holi celebrations in kammam district
కోలాటం వేస్తూ అన్నప్రసాన

By

Published : Mar 9, 2020, 11:12 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాలో దండు వేడుకలు నిర్వహించారు. ఉదయం కామ దహనం అనంతరం వేడుకలను ప్రారంభించారు. హోళీ వేడుకల్లో పాల్గొని కోలాటం, రంగోలి అనంతరం పోయిన హోలీ నుంచి ఈ హోలీ వరకు పుట్టిన పిల్లలకు కోలాటం వేస్తూ అన్నప్రసాన చేశారు.

కొత్త బట్టలు వేసుకుని ప్రతి ఇంట్లో గొర్రెపోతును బలిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

కోలాటం వేస్తూ అన్నప్రసాన

ఇదీ చూడండి:సినిమాలో విలన్లు ఐఫోన్​ అందుకే వాడరట

ABOUT THE AUTHOR

...view details