తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ.. ఎందుకంటే..?

High Court on Bhadrachalam Municipality Election : రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. భద్రాచలం సహా మరో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ.. ఇంకా ఎన్నేళ్లు కాలం వెళ్లదీస్తారని ప్రభుత్వాన్ని ప్రశించింది. ఈ నెల25 లోగా భద్రాచలంతో పాటు మరో మూడు పంచాయతీలపై నిర్ణయం తీసుకోకపోతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

telangana State Govt
telangana State Govt

By

Published : Nov 4, 2022, 10:44 AM IST

High Court on Bhadrachalam Municipality Election: భద్రాచలం సహా మరో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ.. ఎన్నేళ్లు కాలం వెళ్లదీస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. భద్రాచలంతో పాటు మరో మూడు పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తూ వీరయ్య అనే వ్యక్తి 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడానికి వీలు లేదని జీవో అమలును నిలిపివేస్తూ అప్పట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Bhadrachalam Municipality Election Issue : ఈ రెండు పిటిషన్‌లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. భద్రాచలంతో పాటు నాలుగు గ్రామాలను పంచాయతీలుగా కొనసాగిస్తామని ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసినా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని న్యాయస్థానం నిలదీసింది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుందన్నారు.

పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 2005 నుంచి ప్రభుత్వ న్యాయవాదులు మారుతున్నారని.. వాయిదాలు కోరుతూనే ఉన్నారని ఇంకా ఎన్నేళ్లు పడుతుందని హైకోర్టు నిలదీసింది. ఈ నెల 25 లోగా భద్రాచలంతో పాటు మూడు పంచాయతీలపై నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details